చేయి తడిపితేనే అనుమతి..

by Kodari Anjali |

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏ అనుమతి కావాలన్న చేయి తడపాల్సిందే.

చేయి తడిపితేనే అనుమతి..
X

దిశ, వరంగల్ బ్యూరో: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏ అనుమతి కావాలన్న చేయి తడపాల్సిందే. టౌన్ ప్లానింగ్ విభాగానికి అనుమతి పత్రాలు వెళ్లిందే తడవుగా ప్రయత్నాలు మొదలవుతాయి. అన్ని పత్రాలు సబ్మిట్ చేసిన రకరకాల కారణాలు చెబుతూ వాయిదా వేస్తారు. చివరకు పైరవీ కారుల జోక్యంతో కొంత చేయి తడిపిన మీదట అనుమతులు మంజూరు చేస్తారు. ప్రభుత్వానికి టాక్సుల రూపంలో అన్ని చెల్లించిన అదనంగా చెల్లిస్తే డబ్బులు ఇస్తే తప్ప పనికావడం లేదు. అనుమతులు వచ్చిన తర్వాత నిర్మాణం మొదలు పెట్టిన తర్వాత తాజా మాజీలు రంగ ప్రవేశం చేస్తారు. మున్సిపల్ ఉద్యోగులను ఉసికొలిపి వారికి సంబంధించిన డబ్బులు ఎంతో కొంత ఇస్తే తప్ప వదిలిపెట్టడం లేదు.ఈ వసూళ్ల వ్యవహారంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన కొద్ది మంది పనులు చేస్తున్నారు. తాజా మాజీల పదవీకాలం పూర్తి అయిన ఆయా డివిజన్ల పరిధిలో ఇప్పటికీ వారిదే హవా కొనసాగుతుంది.

వీటన్నింటికి నగర కార్పొరేషన్...

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్ల పరిధిలో పలు నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పారిశ్రామిక రంగాల నుంచి నివాసాల వరకు నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇండ్ల నిర్మాణంతో పాటు అపార్ట్ మెంట్లు, కళాశాలలు, పాఠశాలలు, షాపింగ్ కాంప్లెక్స్లు, ఫంక్షన్ హాళ్ల నిర్మాణం కొనసాగుతుంది. నగర శివారులో పలు డివిజన్ల పరిధిలో భారీగా వెంచర్లు కూడా వెలుస్తున్నాయి. వీటన్నింటికి నగర కార్పొరేషన్ పరిధిలోని టౌన్ ప్లానింగ్ విభాగం నుంచే అనుమతులు ఇవ్వాలి. ఆయా భూములు, ప్లాట్లకు సంబంధించిన వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయడంతో అనుమతికి సంబంధించి పన్నులు చెల్లిస్తారు. టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులు అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలి. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా అన్ని పరిశీలించిన మీదట ఈ అనుమతులు ఇస్తున్నారు.

లక్షల రూపాయల వరకు వసూలు..

కొత్త భవనాల నిర్మాణాలకు ఆయా డివిజన్ల పరిధిలోని టౌన్ ప్లానింగ్ అధికారులు వెళ్లి పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలి. అయితే ఇక్కడే తిరకాసు మొదలవుతుంది. ఆయా డివిజన్ల పరిధిలో నిర్మాణానికి చర్యలు చేపట్టగానే చాలా మంది అనుమతుల కోసం పత్రాలు దాఖలు చేసిన మీదటనే అసలు తతంగం మొదలవుతుంది. ఆ పత్రాల్లో కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు లేవని నిబంధనల మేరకు భూమి వదిలిపెట్టలేదని, రోడ్డుకు కావాల్సిన మేరకు స్థలాన్ని వదిలేయలేదని పెండింగ్ లో పెడతారు. అన్ని పత్రాలు ఉన్న కొన్ని పెండింగులో పెడుతున్నారు . ఆయా డివిజన్ల పరిధిలోని బ్రోకర్లు కానీ, తాజా మాజీలు కానీ అధికారులను గాని కలిసిన తర్వాత చర్చలు మొదలవుతాయి. ఆ చర్చలకు అనుగుణంగానే ఎంతో కొంత ముట్టచెప్పిన మీదట నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. చిన్న ఇళ్లు నుంచి పెద్ద ఇండ్ల నిర్మాణం వరకు అపార్ట్ మెంట్ల నుంచి షాపింగ్ మాల్స్ వరకు ఫంక్షన్ హాల్స్ నుంచి వెంచర్ల వరకు వాటి సైజుల బట్టి వేల నుంచి లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. తాజా మాజీలతో పాటు మున్సిపల్ చుట్టూ ఉండే బ్రోకర్లు కొంత మంది ఉద్యోగులు ఇదే పనిగా పెట్టుకొని అనుమతులు ఇస్తున్నారు. ఎవరైనా నిరాకరిస్తే ఏదో రూపకంగా పనులు ఆపించే ప్రయత్నం చేస్తున్నారు.మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం వారితో చెప్పిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు.టౌన్ ప్లానింగ్ విభాగంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన కొన్ని మినహా మిగతా ఏదీ పట్టించుకోవడం లేదు. టౌన్ ప్లానింగ్ విభాగంపై విజిలెన్స్ దర్యాప్తు చేసిన ఏసీబీ దాడులు చేసిన మార్పు మాత్రం లేదు. కొత్తగా వచ్చిన కమిషనర్ ఈ వ్యవహారం పై దృష్టి పెడితే కొంతమేర అరికట్టే అవకాశం ఉంది.

ప్రభుత్వ భూమికి కూడా..

నగరం శివారులో ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిర్మాణంకు సంబంధించి లక్షల రూపాయలు టాక్స్ రూపంలో చెల్లించారు. అన్నీ డాక్యుమెంట్లు పెట్టిన తాజా మాజీలు అనుమతి రాకుండా అడ్డుకున్నారు. చివరికి ఈ విషయం మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో అనుమతులు మంజూరు చేశారు. నగరంలోని గాంధీనగర్ పరిధిలో ఇండ్ల నిర్మాణానికి అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. తండ్రి నుంచి వచ్చిన ప్లాట్ లో పాత ఇళ్లును కూలగొట్టి కొత్త ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేశారు. అన్ని డాక్యుమెంట్లు పెట్టి డబ్బులు చెల్లించిన చివరకు కొంత సమర్పించుకుంటే తప్ప అనుమతులను ఇవ్వలేదు. నగరంలోని 100 ఫీట్ రోడ్ లో బహుళ అంతస్తు భవన నిర్మాణానికి దరఖాస్తు చేశారు. సెట్ బ్యాక్ వదలకున్నా రోడ్డుకు దగ్గరగా నిర్మాణం చేపట్టిన పట్టించుకోలేదు. తాజా మాజీలు, ప్రజాప్రతినిధులు చెప్పడం, అడిగినంత ముట్టచెప్పడంతో అనుమతులను మంజూరు చేశారు. ఆ భవన నిర్మాణం వల్ల భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. వడ్డేపల్లి పరిధిలో ప్రభుత్వ భూమిలో నిర్మాణం కొనసాగుతున్న ఆవైపు చూడలేదు. దానికి సంబంధించి అన్ని అనుమతులను మంజూరు చేశారు. బడా బాబులు వెనుక ఉండటంతో ప్రభుత్వ భూమికి కూడా నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు.

Next Story