అద్దంకి దయాకర్, బల్ముర్ వెంకట్‌లకు మంత్రి హోదా

by velandi.Saikiran |

కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్ముర్ వెంకట్‌లకు రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అద్దంకి దయాకర్, బల్ముర్ వెంకట్‌లకు మంత్రి హోదా
X

దిశ‌, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ విప్ లుగా ఉన్న ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ లకు రాష్ట్ర మంత్రి హోదా ఇచ్చింది. ఈ మేరకు అధికారులు ప్రోటోకాల్ పాటించాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ఏప్రిల్ లోనే అప్పటి సీఎస్ రామకృష్ణారావు పేరుతో జీవో రూపొందింది. అయితే అదే జీవోను తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అద్దంకి దయాకర్ పాత్ర చాలా కీలకమైంది.

అలాగే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరు ఉంది. ఇటు బల్మూరి వెంకట్ విద్యార్థి నాయకుడిగా ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేశాడు. జైల్లో పడ్డాడు. కేసీఆర్ స‌ర్కార్ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టాడు. నిత్యం కాంగ్రెస్ కోసం పనిచేస్తూ, పార్టీని ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు భవిష్యత్తు లీడర్లకు కేబినెట్ హోదా కల్పించింది రేవంత్ రెడ్డి సర్కార్. దీంతో పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డ వాళ్ల‌కు ప‌ద‌వులు దక్కుతాయ‌ని కాంగ్రెస్ మ‌రోసారి నిరూపించిన‌ట్లు కార్య‌క‌ర్త‌లు స్ప‌ష్టం చేస్తున్నారు. కాగా, ఎమ్మెల్సీ పూర్తి పదవీకాలం పాటు మంత్రి హోదా అమల్లో ఉంటుందని ఉత్తర్వులు జారీ కావ‌డం గ‌మ‌నార్హం.

Next Story