- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సల్మాన్ ఖాన్ పై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్..అలాంటి వాడిని !
సల్మాన్ ఖాన్ పై పూజా హెగ్డే కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బడా హీరోలు అందరి సరసన సినిమాలు చేసిన పూజా, ఇప్పుడు పత్తా లేకుండా పోయింది. అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురంలో సినిమా చేసి బంపర్ హిట్ అందుకున్న పూజా హెగ్డే... ఆ తర్వాత గుంటూరు కారంలో అవకాశం దక్కించుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు నుంచి మధ్యలోనే ఆమెను తప్పించింది చిత్ర బృందం. ఈ తరుణంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు రావడం లేదు. కానీ తమిళ్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించే ప్రయత్నం చేస్తున్నారు పూజా హెగ్డే.
ఈ నేపథ్యంలోనే తాజాగా సల్మాన్ ఖాన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ ఖాన్ చాలా మంచివారని.. అతనికి కుట్రలు, కుతంత్రాలు తెలియవంటూ వ్యాఖ్యానించారు. కొంతమంది హీరోలు మాత్రం కుట్రలు పన్నుతుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం రియల్ గా జెన్యూన్ పర్సన్ అంటూ ప్రశంసించారు. మైండ్ లో ఏది ఉంటే అది బయటకు చెప్తారని తెలిపారు. అలా ఉండటం చాలా కష్టమని పూజా హెగ్డే వెల్లడించారు. అటు ప్రభాస్ అంటే ఫుడ్ గుర్తుకు వస్తుందని పేర్కొన్నారు. డాన్స్ చేసేటప్పుడు మ్యూజిక్ ను ఎంజాయ్ చేయడాన్ని హృతిక్ రోషన్ నుంచి నేర్చుకున్నట్లు వివరించారు. అరబిక్ కుతు, మోనికా పాటలు తన ఫేవరెట్ డాన్స్ నెంబర్స్ అంటూ వ్యాఖ్యానించారు.






