ఖానాపూర్ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

by Batti.Sumithra |

ఖానాపూర్ కాలువలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని నార్సింగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఖానాపూర్ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
X

దిశ, గండిపేట : ఖానాపూర్ కాలువలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని నార్సింగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపిన వివరణ ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ గ్రామం దగ్గర ఉన్న కాలువలో వ్యక్తి మృతదేహం పడి ఉంది. సోమవారం డయల్-100కు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 35–40 సంవత్సరాలు ఉంటుందని భావిస్తున్నారు. నలుపు రంగు టీ-షర్ట్, తెలుపు రంగు షార్ట్ ధరించి ఉండగా, ఎడమ చేతి పై టాటూ ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆధారాలతో మృతుడికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు నార్సింగి పోలీస్ స్టేషన్‌ లో సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Next Story