ఉరి వేసుకున్న వ్యక్తి.. కూల్లపోయో స్థితిలో..

by Disha Web Desk 12 |
ఉరి వేసుకున్న వ్యక్తి.. కూల్లపోయో స్థితిలో..
X

దిశ, మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని గోదావరి రోడ్డు సావిత్రి సా మిల్‌లో రూఫ్ కి గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఉన్న మృత దేహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని వయసు సుమారు 30 నుంచి 40 సంవత్సరాలు, ఎత్తు 5 అడుగులు అతని పై బూడిద రంగు చొక్కా, నలుపు రంగు లోయర్ కలదు అని పోలీస్ శాఖ వెల్లడించారు. అతను ఎవరు ఎక్కడినుండి వచ్చాడు అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విషయం పై ఎవరికైనా ఎలాంటి సమాచారం ఉన్న మంచిర్యాల పోలీసులకు ఈ నెంబర్ కు 9440795042, 7901126436 సమాచారం ఇవ్వగలరని తెలిపారు.



Next Story

Most Viewed