- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో అంతులేని విషాదం.. కుటుంబం సామూహిక ఆత్మహత్య
రైలు కిందపడి ఓ కుటుంబం సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన మేడ్చల్ (Medchal) జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్/కాప్రా: రైలు కిందపడి ఓ కుటుంబం సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన మేడ్చల్ (Medchal) జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోడుప్పల్ (Boduppal) పరిధిలోని హరితహారం (Haritahaaram) కాలనీకి చెందిన పి.సురేందర్ రెడ్డి, విజయ, చేతనా రెడ్డి.. చర్లపల్లి - ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని ట్రైన్ కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. విగత జీవులుగా పడి ఉన్న వారిని చూసిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
ఈ మేరకు హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్న పోలీసులు, ఆత్మహత్యకు పాల్పడిన వారు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులుగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి మరణానికి ఆర్థిక ఇబ్బందులా లేక కుటుంబ కలహాలా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. హరితహారం కాలనీలో నివసించే ఈ కుటుంబం అంతా ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఒకేసారి తండ్రి, తల్లి, కొడుకు మరణించడంతో బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు.






