- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
EPFO బంపర్ ఆఫర్.. ఆ డబ్బులన్నీ వాపస్
EPFO అన్‌క్లెయిమ్డ్ మొత్తాలను సంబంధిత చందాదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర కార్మిక శాఖ, ఎంప్లాయీస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సంయుక్తంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థలో ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్లు, ఇనోపరేటివ్ ఖాతాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉద్యోగ మార్పులు, KYC వివరాలు పూర్తికాకపోవడం, బ్యాంక్ ఖాతా లింక్ చేయకపోవడం వంటి కారణాల వల్ల అనేక మంది చందాదారుల నిధులు EPFO ఖాతాల్లోనే మిగిలిపోతున్నాయి.
సోమవారం కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో.. ఈ అన్‌క్లెయిమ్డ్ మొత్తాలను సంబంధిత చందాదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా సుమారు 31 లక్షల మంది EPFO సభ్యులకు ప్రయోజనం కలగనుంది. మొదటి దశగా 7 లక్షల మంది చందాదారులతో పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. ఆధార్ తో లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలు ఉన్నవారి ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేయనున్నారు.
KYC పూర్తి చేయని సభ్యుల కోసం మిషన్ మోడ్‌లో ప్రత్యేక వెరిఫికేషన్ చేపట్టి, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు అనేక మంది తమ సొంత డబ్బును క్లెయిమ్ చేయకుండా వదిలిపెట్టిన పరిస్థితి ఉండగా, ఈ నిర్ణయం ద్వారా ఆ మొత్తాలు సులభంగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి చేరనున్నాయి. EPFO సభ్యులకు ఇది పెద్ద ఊరటగా భావిస్తున్నారు.






