- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంచిర్యాల జిల్లాలో విషాదం నింపిన హోళీ పండుగ
by Bhoopathi Nagaiah |
పండగ పూట జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన

X
దిశ, మంచిర్యాల: పండగ పూట జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీఎం ఆఫీస్ దగ్గర చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జైపూర్ మండలంలోని ఇందారం గ్రామానికి చెందిన తొగిటి ప్రసాద్(30), రామారావు పేటకు చెందిన బొద్ధున్న నరేష్(30) శ్రీరాంపూర్ నుండి ఇద్దరం వైపు వెళ్తుండగా గోదావరిఖని నుండి మంచిర్యాలకు వెళ్తున్నా ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు ప్రసాద్ జువెలరీ షాప్‌లో పని చేస్తుండగా, నరేష్ శ్రీరాంపూర్ ఓసీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే శ్రీరాంపూర్ సీఐ రాజు, ఎస్ఐ మానస ఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.
Next Story






