రోడ్డుపై ఆటో రిపేర్ చేస్తుండగా దూసుకొచ్చిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

by Jakkula.Mamatha |

కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలు పాలైన సంఘటన సత్తుపల్లి మండలం గంగారం గ్రామ శివారులో శనివారం ఉదయం చోటుచేసుకుంది.

రోడ్డుపై ఆటో రిపేర్ చేస్తుండగా దూసుకొచ్చిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు
X

దిశ,సత్తుపల్లి: కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలు పాలైన సంఘటన సత్తుపల్లి మండలం గంగారం గ్రామ శివారులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామానికి చెందిన వేముల మారేష్, తగరం హరికృష్ణ, ఇంటి నిర్మాణానికి వాడే చెక్క సెంట్రింగ్ వస్తువులను గురుపట్ల గూడెం గ్రామానికి తరలిస్తుండగా బి. గంగారం గ్రామ శివారు మార్గ మధ్యలో సెంట్రింగ్ సామాన్లను తరలిస్తున్న ఆటోలో ఒక్కసారిగా పొగలు రావడంతో వేముల మారేష్, తగరం హరికృష్ణ ఆటోను పరిశీలిస్తుండగా బి. గంగారం వైపు నుంచి చింతలపూడి వైపు వెళ్తున్న కారు వారిని ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న సత్తుపల్లి 108 సిబ్బంది సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల నిమిత్తం వేముల మారేష్ ను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు, ఈ సంఘటన పై సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story