బీజేపీ నేతల నిరసనలో అపశృతి.. ఎస్సైపై ఫిర్యాదు

by Satheesh |

దిశ, కుత్బుల్లాపూర్: బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో- latest Telugu news

బీజేపీ నేతల నిరసనలో అపశృతి.. ఎస్సైపై ఫిర్యాదు
X

దిశ, కుత్బుల్లాపూర్: బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేస్తుండగా.. జీడిమెట్ల పోలీసులు అడ్డుకున్నారు. దిష్టి బొమ్మ దహణమవుతున్న సమయంలో బీజేపీ నాయకులు మల్లేష్, రాజిరెడ్డిలకు మంటలు అంటుకుని గాయాలయ్యాయి. ఎస్సై ఆంజనేయులు అత్యుత్సాహంతో మంటలను తన్నడంతో మాకు మంటలు అంటుకున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని సీఐ బలరాజుకు గాయాలకు గురైన నాయకులు పిర్యాదు చేశారు.

Next Story