చాకచక్యంగా చోరీలు.. వాహన తనిఖీల్లో దొరికిన ఇద్దరు నిందితులు

by Batti.Sumithra |

వ్యవసాయ బావుల వద్ద అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ పంపులను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను ఆదివారం మర్కూక్ పోలీసులు అరెస్టు చేసి రెండు కేసులను ఛేదించారు.

చాకచక్యంగా చోరీలు.. వాహన తనిఖీల్లో దొరికిన ఇద్దరు నిందితులు
X

దిశ, ములుగు : వ్యవసాయ బావుల వద్ద అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ పంపులను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను ఆదివారం మర్కూక్ పోలీసులు అరెస్టు చేసి రెండు కేసులను ఛేదించారు. సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా వెళ్తున్న తాటికొండ రమేష్ అలియాస్ స్వామి, డప్పు యాదగిరిని అదుపులోకి తీసుకుని విచారించగా పలుసంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

విచారణలో మర్కూక్ పరిధిలోని వ్యవసాయ క్షేత్రాల నుంచి రెండు ఎలక్ట్రిక్ మోటార్ పంపులను, దామరకుంట గ్రామ శివారులో ముగ్గురు రైతులకు చెందిన మరో మూడు మోటార్ పంపులను చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మర్కుక్ ఎస్సై యునస్ అహ్మద్ అలీ వారి వద్ద నుంచి మొత్తం ఐదు ఎలక్ట్రిక్ మోటార్ పంపులు, చోరీలకు ఉపయోగించిన అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనం, రూ.2,000 నగదు, ఒక ఆక్సో బ్లేడ్‌ను స్వాధీనం తెలిపారు. ప్రధాన నిందితుడు తాటికొండ స్వామి గతంలోనూ పలు ఆస్తి నేరాల్లో పాల్పడిన అలవాటైన నేరస్థుడిగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల పై సంబంధిత కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మర్కూక్ పోలీసులు తెలిపారు.

Next Story