- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ పార్టీలో నర్సన్నపల్లి సర్పంచ్ తో సహా పలువురి చేరిక
కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ రాసమొల్ల రవితో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 20 మంది ఆదివారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

దిశ, కామారెడ్డి : కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ రాసమొల్ల రవితో సహా 20 మంది వివిధ పార్టీ లకు చెందిన వారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా వారికి షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఆలే శ్రీకాంత్, రసమోల్ల భూమయ్య, చందన స్వామి, చందన చంద్రం, రసమోల్ల రాజయ్య, ధ్యాప చిన్న అంజయ్య, పిట్టల నర్సింలు, ఆలే రాజయ్య, రసమోల్ల స్వామి, ధ్యాప రవి తదితరులు సుమారు 20 మంది ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ..రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు విశేషంగా ఆకర్షితులవుతున్నారని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని, అందుకే అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు, గౌరవం లభిస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, రాష్ట్ర యువజన నాయకులు మహమ్మద్ ఇలియాస్, కామారెడ్డి మండల అధ్యక్షులు రాజా గౌడ్, కామారెడ్డి పట్టణ అధ్యక్షులు ఐరేని సందీప్, యువజన కాంగ్రెస్ నాయకులు హనుమాన్లు, రామ్ కుమార్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు భూమని బాలరాజ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు రెడ్యానాయక్, తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డిలో యువత చేరిక..
బీఆర్ఎస్, బీజేపీ నుంచి సుమారు 70 మంది యువకులకు కాంగ్రెస్ కండువా కప్పిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పార్టీలోకి ఆహ్వానించారు. బాణాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో 40 మంది, వంశీ యాదవ్, భాను యాదవ్ ఆధ్వర్యంలో 30 మంది యువకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. చేరిన వారిలో శివకుమార్, నిఖిల్, సాయిరాజ్, నీరజ్, విష్ణు, కన్నా, సాయి, లక్ష్మణ్, శ్రీశాంత్, అనురాగ్, అబ్భు, రామ్ యాదవ్, నిక్కి రాయి, కౌశిక్, ప్రభాస్, ప్రశాంత్, కళ్యాణ్, సతీష్, గణేష్, పండు, శ్రీ సాయి, నందు, రాము, భాను తదితరులతో సహా 70 మంది యువకులకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.






