- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెరంబూర్ నుంచి విజయ్.. తిరుచ్చి ఈస్ట్ ఎవరికో?
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీవీకే అధినేత విజయ్, ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనల ప్రకారం కీలక నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీవీకే అధినేత విజయ్, ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనల ప్రకారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసి, రెండింటిలోనూ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(1), ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 70 ప్రకారం, ఒక వ్యక్తి ఒకే సమయంలో రెండు స్థానాలకు ప్రాతినిధ్యం వహించడానికి వీలులేదు. రెండు స్థానాల్లో గెలిచిన అభ్యర్థి ఫలితాలు వెలువడిన 14 రోజుల్లోపు ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే విజయ్ చెన్నై నగర పరిధిలోని పెరంబూర్ నియోజకవర్గాన్ని తన శాసనసభ స్థానంగా ఎంచుకుని, తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
పెరంబూర్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం వెనుక రాజకీయ, పరిపాలనాపరమైన వ్యూహాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా సచివాలయ కార్యకలాపాలకు దగ్గరగా ఉండటం, చెన్నైపై పట్టు సాధించడం ఆయనకు సులువవుతుంది. విజయ్ తన రాజీనామా లేఖను స్పీకర్‌కు సమర్పించిన అనంతరం.. తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం అధికారికంగా ఖాళీ అయినట్లు ప్రకటించబడుతుంది. నిబంధనల ప్రకారం, ఆ స్థానానికి రానున్న ఆరు నెలల లోపు ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇపుడు అందరి దృష్టి తిరుచ్చి ఈస్ట్ మీదనే ఉంది. టీవీకేకు మద్దతు తెలిపిన వీసీకేకు తిరుచ్చి కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది. మరి విజయ్ ఆ స్థానాన్ని వీసీకేకు ఇస్తారా.. లేదా ఇంకెవరికైనా ఇవ్వనున్నారా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు ఆ స్థానం నుంచి త్రిషను బరిలోకి దింపుతారని కూడా సోషల్ మీడియాలో విపరీత ప్రచారం జరుగుతోంది.






