నేను సెక్స్ వర్కర్‌ అనుకుంటున్నారా?.. బుల్లితెర నటి ఫైర్

by Dishanational2 |
నేను సెక్స్ వర్కర్‌ అనుకుంటున్నారా?.. బుల్లితెర నటి ఫైర్
X

దిశ, సినిమా :ప్రముఖ హిందీ టెలివిజన్ యాక్టర్ విభూతి ఠాకూర్ లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపింది. ఇటీవల తన ఫోన్ నంబర్ ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో పలువురు కాల్ చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నారంటూ సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. ఈ విషయంపై తాజాగా మీడియాతో మాట్లాడిన నటి.. 'మొదట ఎవరో కావాలనే ఆటపట్టిస్తున్నారని అనుకున్నా. కానీ వివిధ నంబర్ల నుంచి అనేక కాల్స్ వస్తుండటం, మాట్లాడే వ్యక్తుల వాయిస్‌లో తేడాలు గుర్తించి ఏదో జరిగిందని అర్థమైంది. అప్పటికే కాల్ చేసినవాళ్లందరూ నాతో పడక సుఖాన్ని కోరుతూ నన్ను ఒక సెక్స్ వర్కర్‌ మాదిరిగా ట్రీట్ చేశారు. సెక్స్‌ పదాలతో చాట్ చేస్తూ మానసిక క్షోభకు గురిచేశారు. స్త్రీలను తల్లిగా భావించే దేశంలో ఒక మహిళను ఇంత దారుణంగా కించపరడం సిగ్గుచేటు' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే తన నంబరును ఆన్‌లైన్‌లో లీక్ చేసిన నేరస్థుడిని వీలైనంత త్వరగా పట్టుకుని తనకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లుగా తెలిపింది.




Next Story

Most Viewed