- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పసిపాపను ఎత్తుకుని ప్రచారం.. కేంద్రమంత్రిని ఓడించిన ట్యూషన్ టీచర్
కేంద్ర మంత్రి ఎల్. మురుగన్‌ను 28 ఏళ్ల కమలి ఓడించి సంచలనం సృష్టించారు. 4 నెలల బిడ్డను ఎత్తుకుని ప్రచారం చేసిన ఈ టీవీకే అభ్యర్థి, ఇప్పుడు తమిళనాడులో అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా నిలిచారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవరూ ఊహించని విధంగా టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అలాగే చిన్న పార్టీలను కలుపుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అవుతుంది. ఈ ఎన్నికల్లో ఎన్నో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం స్టాలిన్ సహా 20 మంది మంత్రులు ఓటమి పాలయ్యారు. అలాగే మరో అనూహ్య ఫలితంతో కేంద్రమంత్రిపై ట్యూషన్ టీచర్ భారీ విజయం సాధించింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి చెందిన 28 ఏళ్ల ఎస్. కమలి, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్‌ను ఓడించి చరిత్ర సృష్టించారు. అవినాషి (SC) నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆమె, తన సమీప ప్రత్యర్థి, కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్‌పై 15,373 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి, ఈ అసెంబ్లీలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా రికార్డుకెక్కారు.
కమలి నేపథ్యం, ఆమె విజయ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం గా నిలుస్తోంది. వృత్తిరీత్యా ట్యూషన్ టీచర్ అయిన కమలి, పేద విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెబుతూ సేవా కార్యక్రమాల్లో ఉండేవారు. విజయ్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితురాలై టీవీకేలో చేరిన ఆమె, తన 4 నెలల పసిపాపను ఎత్తుకుని నియోజకవర్గం అంతా తిరిగి ప్రచారం చేశారు. సామాన్య మహిళగా, ఒక ట్యూషన్ టీచర్‌గా ఉన్న కమలి.. హేమాహేమీలను ఎదిరించి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. సామాన్యులకు అవకాశం ఇస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో కమలి విజయం నిరూపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






