టీటీడీ కీలక ప్రకటన.. ఆ దర్శనాలు రద్దు

by Muthe.Rajitha |

తిరుమలలో ఈనెల 25న రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు టీటీడీ పేర్కొంది.

టీటీడీ కీలక ప్రకటన.. ఆ దర్శనాలు రద్దు
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమలలో ఈనెల 25న రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు టీటీడీ పేర్కొంది. అయితే ఆ రోజు భక్తుల భారీగా రద్దీ ఉంటుందని అంచనా వేస్తూ.. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో జరిగే రథసప్తమి వేడుకల దృష్ట్యా అన్ని ఆర్జిత సేవలు అనగా.. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు పూర్తిగా రద్దు చేశారు. అలాగే VIP బ్రేక్ దర్శనాలు(ప్రోటోకాల్ అతిథులు తప్ప), NRI దర్శనం, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్స్, వికలాంగుల ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేశారు. స్లాటెడ్ సర్వ దర్శనం (SSD) టోకెన్లను జనవరి 24 నుంచి 26 వరకు మూడు రోజులపాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.

రథసప్తమి రోజున లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో భక్తుల భద్రత కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు TTD తెలిపింది. కాగా రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారు. స్వామివారు ఉదయం సూర్యప్రభ వాహనంతో పాటు మొత్తం ఏడు వాహనాలపై భక్తులకు దర్శనం ఇస్తారు. భక్తులకు ఈ రోజు కేవలం ఉచిత సర్వ దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Next Story