- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల భక్తులకు TTD గుడ్ న్యూస్
తిరుమల వెళ్లే భక్తులకు అదనపు పడక సామాగ్రిని అతి తక్కువ అద్దెకు టీటీడీ అందుబాటులోకి తెచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు గుడ్ న్యూస్ తెలిపింది టీటీడీ. వేసవి కాలంలో భక్తుల రద్దీ పెరుగనున్న నేపథ్యంలో, వసతి గృహాల్లో బస చేసే వారి కోసం అదనపు సామాగ్రిని తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమలలోని వసతి గృహాల్లో బస చేసే భక్తులు తమ వెంట వచ్చే చిన్నారులు, పెద్దల కోసం అదనంగా దిండు, దుప్పటి, చాప, రగ్గులను అద్దెకు తీసుకునే సదుపాయాన్ని టీటీడీ కల్పించింది. ప్రస్తుతం ఈ సేవలు నందకం అతిథి గృహంలో ప్రారంభమయ్యాయి. త్వరలోనే వీటిని వకుళమాత, పాంచజన్యం, కౌస్తుభం వంటి ఇతర పెద్ద అతిథి గృహాలకు కూడా విస్తరించనున్నారు. భక్తులు తమకు కావాల్సిన సామాగ్రిని ఆయా అతిథి గృహాల రిసెప్షన్ కౌంటర్ల వద్దే పొందవచ్చు.
ఈ సేవల కోసం టీటీడీ అత్యంత తక్కువ ధరలను నిర్ణయించింది. భక్తులు ఒక దుప్పటికి రూ.10, రెండు దిండులకు రూ.10, ఒక చాపకు రూ.10, ఒక రగ్గుకు రూ.20 చొప్పున అద్దె చెల్లించి వీటిని తీసుకోవచ్చు. వేసవి సెలవుల కారణంగా గదుల్లో అదనంగా ఉండే భక్తులకు నేలపై పడుకోవడానికి ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. గతంలో ఇటువంటి సదుపాయం లేక భక్తులు బయట ప్రైవేటు దుకాణాల్లో ఎక్కువ ధరలకు కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు టీటీడీ నిర్ణయంతో సామాన్య భక్తులకు ఆర్థిక భారంతో పాటు ఇబ్బందులు కూడా తప్పనున్నాయి.
- Tags
- TTD
- Tirumala News






