TSRJC సెట్ ​దరఖాస్తు గడువు పొడిగింపు.. అప్పటి వరకు అవకాశం

by Dishafeatures2 |
TSRJC సెట్ ​దరఖాస్తు గడువు పొడిగింపు.. అప్పటి వరకు అవకాశం
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర గురుకుల(రెసిడెన్షియల్) జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సోమవారంతో ఈ గడువు ముగియాల్సి ఉండగా విద్యార్థులు, తల్లిదండ్రుల కోరిక మేరకు గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు స్పష్టం చేశారు. 2022-23 విద్యాసంవత్సరానికి ఇంటర్​ఫస్టియర్(ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ)లో 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు మే 22వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పదో తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.


Next Story

Most Viewed