ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-21 06:54:49  IST  )

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల వాతావరణంతో ఉదయం నుంచే స్టాక్ మార్కెట్లు సూచీలు నష్టాల్లో పయనించాయి.

ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
X

దిశ, వెబ్ డెస్క్: స్టాక్ మార్కెట్లు వరుసగా భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. తాజాగా బుధవారం ఉదయం కూడా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల వాతావరణంతో ఉదయం నుంచే స్టాక్ మార్కెట్లు (Stock markets) సూచీలు నష్టాల్లో పయనించాయి. ముఖ్యంగా సెన్సెక్స్ 690 పాయింట్లకు పైగా కుప్పకూలి 81,582 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 25,100 మైలురాయి కంటే దిగువకు పడిపోయింది. గత సెషన్‌లో కూడా సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా నష్టపోగా, నేడు కూడా అదే ఒరవడి కొనసాగడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది.

ఈ భారీ పతనానికి ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన కొత్త టారిఫ్ విధానాలే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా కొనుగోలు చేసే ప్రతిపాదనను వ్యతిరేకించే యూరోపియన్ దేశాలపై 10% నుంచి 25% వరకు సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించడంతో గ్లోబల్ ట్రేడ్ వార్ భయాలు మళ్లీ మొదలయ్యాయి. దీనికి తోడు భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరించుకోవడం, రిలయన్స్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ వంటి దిగ్గజ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం కూడా మార్కెట్లను కుంగదీశాయి.

Read More..

BREAKING: ట్రంప్ దావోస్ పర్యటన.. విమానానికి తప్పిన భారీ ప్రమాదం

Next Story