వైట్ హౌస్ బాల్‌రూమ్ నిర్మాణంపై ట్రంప్ సంచలన పోస్ట్

by Malleboina Mahesh |

వైట్ హౌస్ లోపల అత్యంత సురక్షితమైన బాల్‌రూమ్! నిర్మాణంపై కోర్టుకెళ్లిన మహిళపై ట్రంప్ ఆగ్రహం. 150 ఏళ్ల నాటి కల నెరవేరుతోందన్న అధ్యక్షుడు.

వైట్ హౌస్ బాల్‌రూమ్ నిర్మాణంపై ట్రంప్ సంచలన పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా వైట్ హౌస్ ఆవరణలో నిర్మిస్తున్న అత్యంత సురక్షితమైన 'మిలిటరీ టాప్ సీక్రెట్' బాల్‌రూమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత రాత్రి జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ.. వైట్ హౌస్ మైదానంలో భారీ, సురక్షితమైన బాల్‌రూమ్ ఉండాలని గత 150 ఏళ్లుగా ప్రతి అధ్యక్షుడు, మిలిటరీ, సీక్రెట్ సర్వీస్ కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బాల్‌రూమ్ అందుబాటులో ఉండి ఉంటే, గత రాత్రి జరిగిన అవాంఛనీయ ఘటన అసలు సంభవించేదే కాదని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

ఈ కొత్త బాల్‌రూమ్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన భవనమైన వైట్ హౌస్ గేట్ల లోపల నిర్మించబడుతోందని, ఇందులో అత్యున్నత స్థాయి భద్రతా ఫీచర్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. బాల్‌రూమ్ నిర్మాణంపై దాఖలైన వ్యాజ్యాల పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళ తన కుక్కను నడిపిస్తూ వేసిన ఈ 'హాస్యాస్పదమైన' కేసును తక్షణమే కొట్టి వేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు బడ్జెట్ పరిమితుల్లోనే ఉందని, షెడ్యూల్ కంటే వేగంగా పనులు జరుగుతున్నాయని పేర్కొంటూ, దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు కలగకూడదని ట్రంప్ స్పష్టం చేశారు.

Next Story