నోబెల్ బహుమతిపై ట్రంప్ సంచలన నిర్ణయం

by Gantepaka Srikanth |

నోబెల్ బహుమతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

నోబెల్ బహుమతిపై ట్రంప్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: నోబెల్ బహుమతి(Nobel Prize)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన నిర్ణయం తీసుకున్నారు. నోబెల్ బహుమతి తనకు లెక్క కాదని ప్రకటించారు. ఇకనుంచి నోబెల్ గురించి పట్టించుకోను, అవసరం కూడా లేదు అనే రీతిలో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందిని కాపాడిన చరిత్ర తనదని పేర్కొన్నారు. అలాంటి తనకు నోబెల్ ఇవ్వకుండా అడ్డుకున్నారని అన్నారు. దీనికి తోడు తాజాగా ఆయన నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్‌కు రాసిన లేఖలోనూ నోబెల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 8 యుద్ధాలు ఆపాను. అయినా కూడా నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు. దాంతో ఇక శాంతి కోసమే ఆలోచించకూడదని నిర్ణయించుకున్నా. ఇప్పటికీ నాకు శాంతి ముఖ్యమే. కానీ ముందు అమెరికాకు ఏది మంచిదో, ముఖ్యమో అదే చేయడంపై ఫోకస్ పెడతా అని తన లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. గ్రీన్‌లాండ్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని అన్నారు. నా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఐరోపా దేశాలపై అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు.

Next Story