- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్‌పై భారీ అటాక్ ప్లాన్. కానీ..! : ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధంపై మరో కీలకమైన ప్రకటన చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధంపై మరో కీలకమైన ప్రకటన చేశారు. మంగళవారం ఇరాన్‌పై జరపాల్సిన భారీ సైనిక దాడిని చివరి నిమిషంలో వాయిదా వేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. గల్ఫ్ దేశాల అభ్యర్థన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఖతర్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌లు అమెరికాను సంప్రదించి.. ఇరాన్‌తో ప్రస్తుతం ఒక ఒప్పందం కోసం తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, కాబట్టి ప్రస్తుతానికి దాడిని నిలిపివేయాలని వారు ట్రంప్‌ను కోరారని పేర్కొన్నారు. దీంతో సైనిక దాడి ప్రక్రియను నిలిపివేశామని తెలియజేసారు.
ఈ మేరకు ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా స్పందిస్తూ.. "గల్ఫ్ దేశాల నాయకులపై ఉన్న గౌరవంతో మంగళవారం జరగాల్సిన సైనిక దాడిని నిలిపివేయాలని రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్, జాయింట్ చీఫ్స్ చైర్మన్‌లను ఆదేశించాను. వారు ఇరాన్‌తో ఒక మంచి ఒప్పందం కుదురుతుందని నమ్ముతున్నారు. ఆ ఒప్పందంలో ఇరాన్ వద్ద 'ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకూడదు' (NO NUCLEAR WEAPONS FOR IRAN!) అనేదే ప్రధాన శరతు" అని పేర్కొన్నారు. అయితే ఈ వాయిదా తాత్కాలికమేనని ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్‌తో చర్చలు సఫలం కాకపోతే, ఏ క్షణంలోనైనా ఇరాన్‌పై పూర్తి స్థాయి, అతిపెద్ద సైనిక దాడి చేయడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని అమెరికా రక్షణ విభాగాన్ని ఆదేశించినట్లు ఆయన హెచ్చరించారు. ఇరాన్ ఇటీవల పాకిస్తాన్ ద్వారా అమెరికాకు ఒక కొత్త ప్రతిపాదనను పంపినట్లు వార్తలు వస్తున్న తరుణంలో, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.






