టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మృతి..

by Satheesh |

దిశ, దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండలంలోని సయ్యద్ నగర్ సర్పంచ్ షేక్- latest Telugu news

టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మృతి..
X

దిశ, దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండలంలోని సయ్యద్ నగర్ సర్పంచ్ షేక్ ఆసన్ బీ కుమారుడు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహబూబ్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. శుక్రవారం రాత్రి మృతి చెందారు. కాగా, మహబూబ్ పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్‌లో చురుకుగా పాల్గొన్నారు. అయితే, మహబూబ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు‌లు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. నిరుపేద కుటుంబానికి చెందిన మహబూబ్ మరణించడంతో పలువురు నాయకులు ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేస్తున్నారు.

Next Story