టీఆర్ఎస్‌కు షాక్.. గవర్నర్ ముందే సర్పంచ్ రాజీనామా..

by Satheesh |

దిశ, అచ్చంపేట: నల్లమలలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటన సందర్భంగా- LATEST TELUGU NEWS

టీఆర్ఎస్‌కు షాక్.. గవర్నర్ ముందే సర్పంచ్ రాజీనామా..
X

దిశ, అచ్చంపేట: నల్లమలలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటన సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని సార్లపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ చిగుళ్ల మల్లికార్జున్ గవర్నర్‌కు సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు అందుకు సంబంధించిన రాజీనామా పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ, పంచాయతీ షెడ్యూల్ యాక్ట్, ఏజెన్సీ హక్కుల ప్రకారం చేసిన తీర్మానాలను సంబంధిత అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని, అందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నానని తెలిపారు. మా గ్రామంలో నాటు సారాను పూర్తిగా నిషేధించాలని, బెల్టు షాపులను తొలగించాలని, అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కులు కల్పించాలని సుమారు 20 నుండి 30 తీర్మానాలు చేసి గ్రామపంచాయతీ అధికారులకు పంపించినా ఫలితం లేదన్నారు. మా తీర్మానాలను అధికారులు హేళనగా చూస్తున్నారని, అందుకు మనోవేదనకు గురై రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

Next Story