అక్కినపల్లి మల్లారం మూలమలుపు వద్ద ట్రాలీ బోల్తా..

by Batti.Sumithra |

పినపాక నియోజకవర్గంలోని అక్కినపల్లి మల్లారం మూలమలుపు మార్గంలో కూలీలతో ప్రయాణిస్తున్న ట్రాలీ గురువారం అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో పలువురు కూలీలు గాయపడ్డారు.

అక్కినపల్లి మల్లారం మూలమలుపు వద్ద ట్రాలీ బోల్తా..
X

దిశ, మణుగూరు : పినపాక నియోజకవర్గంలోని అక్కినపల్లి మల్లారం మూలమలుపు మార్గంలో కూలీలతో ప్రయాణిస్తున్న ట్రాలీ గురువారం అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో పలువురు కూలీలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవలైన 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని 22 మంది క్షతగాత్రులను మణుగూరు ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న వెంటనే సూపరింటెండెంట్ డాక్టర్ ముత్తినేని గౌరీ ప్రసాద్ స్వయంగా అత్యవసర విభాగానికి చేరుకుని వైద్య బృందాన్ని అప్రమత్తం చేశారు. గాయపడిన ప్రతి ఒక్కరికీ తక్షణ వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందేలా దగ్గరుండి పర్యవేక్షించారు. 22 మంది క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి బాధితులకు వైద్యసేవలు అందించడం ప్రభుత్వ ఆసుపత్రుల సేవా దృక్పథానికి నిదర్శనమని పలువురు అభినందించారు.

Next Story