బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి త్రివేణి విద్యార్థుల నగదు వితరణ

by Batti.Sumithra |

ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా త్రివేణి పాఠశాలల విద్యార్థులు సేకరించిన సహాయ నిధి నుంచి 1,01,116 రూపాయల నిధిని డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి బసవతారకం హాస్పిటల్ చైర్మన్, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ అందించి, శాలువాతో సత్కరించారు.

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి త్రివేణి విద్యార్థుల నగదు వితరణ
X

దిశ, ఖమ్మం : ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా త్రివేణి పాఠశాలల విద్యార్థులు సేకరించిన సహాయ నిధి నుంచి 1,01,116 రూపాయల నిధిని డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి బసవతారకం హాస్పిటల్ చైర్మన్, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ అందించి, శాలువాతో సత్కరించారు. త్రివేణి పాఠశాలల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి, బసవతారకం హాస్పిటల్స్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా కలిసి పిల్లలు సేకరించిన నిధి నుంచి 1,01,116 రూపాయలు అందజేశారు. త్రివేణి పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ త్రివేణి సంస్థలు మానవత్వం మనిషితత్వం అనే నినాదంతో అనేక ఛారిటీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి అని తెలియజేశారు.

కరోనా సమయంలో గానీ, మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా కాని, సీతారాముల కళ్యాణ మహోత్సవంలో మజ్జిగ ప్యాకెట్లు, మంచినీటి ప్యాకెట్ల వితరణలో గాని, జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో నిధిని సేకరించి ప్రతి సంవత్సరం గవర్నర్ సహాయనిధికి అందజేశారు. ఇలా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా త్రివేణి విద్యాసంస్థలు, త్రివేణి విద్యార్థులు ఛారిటీ కార్యక్రమాలలో ఎప్పుడు ముందుంటారని డైరెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు బాలకృష్ణ మాట్లాడుతూ త్రివేణి పిల్లల సహాయ, సేవా నిరతిని కొనియాడుతూ పిల్లలు యువతరానికి నాయకులు నవతరానికి వారధులు, భావితరానికి భారత దేశ మహాశక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో త్రివేణి పాఠశాలలకు సంబంధించిన సీఓ అడ్మిన్ అప్పారావు, సీఆర్ఓలు వెంకట్రావు, సాయి నరసింహారావు, సుబ్బారావు, సెంట్రల్ అకౌంట్స్ ఆఫీసర్ చెంచారావు పాల్గొన్నారు.

Next Story