- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగాల్ ఎన్నికల వేళ ఐ-ప్యాక్ వెనక్కి? క్లారిటీ ఇచ్చిన తృణమూల్ కాంగ్రెస్
బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఐ-ప్యాక్ కార్యకలాపాలు నిలిపివేసినట్లు వస్తున్న వార్తలను తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. ఇవన్నీ విపక్షాల కుట్రలని, ప్రచారం యథావిధిగా సాగుతుందని స్పష్టం చేసింది.

దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో ఐ-ప్యాక్ (I-Pack) తన కార్యకలాపాలను 20 రోజుల పాటు నిలిపి చేసిందంటూ సోషల్ మీడియా, కొన్ని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా ఈ వార్తలపై తృణమూల్ కాంగ్రెస్ స్పందిస్తూ.. అటువంటి వార్తలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసింది. ఐ-పాక్ కార్యకలాపాలను నిలిపేసిందనే సమాచారం 'అవాస్తవం' (Baseless) అని కొట్టిపారేస్తూ పార్టీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. క్షేత్రస్థాయిలో గందరగోళం సృష్టించేందుకే విపక్షాలు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడింది.
ఐ-ప్యాక్ పశ్చిమ బెంగాల్ బృందం ఇప్పటికీ టీఎంసీ (TMC)తో కలిసి పూర్తిస్థాయిలో పనిచేస్తోందని, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా సాగుతున్నాయని పార్టీ తెలిపింది. ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరగనున్న రెండు దశల పోలింగ్‌పై బెంగాల్ ప్రజలు స్పష్టమైన అవగాహనతో ఉన్నారని, మే 4న వచ్చే ఫలితాలు విపక్షాల కుట్రలకు తగిన సమాధానం చెబుతాయని టీఎంసీ పేర్కొంది. ఐ-ప్యాక్ డైరెక్టర్ వినేష్ చందేల్ను మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ (ED) ఇటీవల అరెస్టు చేసిన నేపథ్యంలో, ఆ సంస్థ తన కార్యకలాపాలను నిలిపివేసి ఉండవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే, ఈ అరెస్టును ‘రాజకీయ కక్షసాధింపు ('Political partisanship')గా అభివర్ణించిన టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇటువంటి తప్పుడు కథనాలను సృష్టిస్తున్నారని, బెంగాల్ ప్రజలు ఇటువంటి బెదిరింపులకు, తప్పుడు సమాచారానికి లోనుకారని టీఎంసీ తన ప్రకటనలో ధీమా వ్యక్తం చేసింది.






