- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గూడూరులో చిన్న జీయర్ స్వామి దిష్టి బొమ్మ దగ్ధం
by S Gopi |
దిశ, గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ లో..Tribals Fire On Chinna Jeeyar Swamy Comments

X
దిశ, గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ లో చిన్న జీయర్ స్వామి దిష్టి బొమ్మను ఆదివాసీ గిరిజన సంఘాలు మరియు తుడుం దెబ్బ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవమైన మేడారం సమ్మక్క సారలమ్మను అవమానపరుస్తూ మాట్లాడిన చిన్న జీయర్ స్వామి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల చరిత్ర, సమ్మక్క-సారలమ్మల చరిత్ర తెలుసుకుని మాట్లాడాలన్నారు. ఆదివాసీల జోలికి వస్తే ఊరుకునేదే లేదంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈసం సుధాకర్, సారయ్య, వీరస్వామి, పడిగే మంగయ్య, ఐళబోయున సమ్మక్క, దారం సిద్దు, శ్రీనివాస్, బత్తుల శ్రీనివాస్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Next Story






