ప్రెగ్నెన్సీ క్లెయిమ్‌తో వైరల్ గర్ల్ 'మోనాలిసా' కేసు విచారణకు బ్రేక్!

by Malleboina Mahesh |   (  Updated:2026-04-23 05:23:18  IST  )

వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే గర్భవతి అని ఆమె భర్త పోలీసులకు తెలపడంతో విచారణలో జాప్యం ఏర్పడింది. మరోవైపు ఆమె మైనర్ అని ఎన్‌సీఎస్‌టీ నివేదిక వెల్లడించడంతో కేసు క్లిష్టంగా మారింది.

ప్రెగ్నెన్సీ క్లెయిమ్‌తో వైరల్ గర్ల్ మోనాలిసా కేసు విచారణకు బ్రేక్!
X

దిశ, వెబ్ డెస్క్: యూపీలోని మహాకుంభమేళాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోనాలిసా భోంస్లే (Monalisa Bhosle) వివాహ ఉదంతం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ప్రస్తుతం ఆమె గర్భవతి (pregnant) అని, ఆరోగ్యం సహకరించని కారణంగా పోలీసుల విచారణకు హాజరు కాలేదని ఆమె తన భర్త ఫర్మాన్ ఖాన్ (Farman Khan) అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తుంది. మార్చి 11న కేరళలో జరిగిన వీరి వివాహంపై ఇప్పటికే మైనర్ వివాదం నడుస్తుండగా, పెళ్లయిన నెలకే ఆమె గర్భం దాల్చినట్లు వచ్చిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

కాగా విచారణకు, పోలీసులకు మోనాలిసాను దూరంగా ఉంచేందుకు ఫర్మాన్ ఖాన్ ఈ నాటకం ఆడుతున్నాడని సోషల్ మీడియాలో పలువురు విమర్శిస్తున్నారు. ఈ కోణంలోనే పోలీసులు సైతం అనుమానిస్తున్నారు. దీంతో మోనాలిసా భోంస్లే గర్భధారణ వార్తలను వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించుకోవాలని మధ్యప్రదేశ్ పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.

మైనర్ వివాదం.. చట్టపరమైన చిక్కులు

మరోవైపు జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) జరిపిన విచారణలో మోనాలిసా వయస్సుపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి రికార్డుల ప్రకారం ఆమె డిసెంబర్ 30, 2009న జన్మించినట్లు తేలింది. దీని ప్రకారం వివాహ సమయానికి ఆమె వయస్సు కేవలం 16 ఏళ్లేనని, కాబట్టి ఇది చట్టవిరుద్ధమైన మైనర్ వివాహమని ఎన్‌సీఎస్‌టీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఫర్మాన్ ఖాన్‌పై ఇప్పటికే పోక్సో (POCSO), ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కేరళ హైకోర్టు ఫర్మాన్ ఖాన్ అరెస్టుపై మే 20 వరకు మధ్యంతర స్టే విధించడంతో, ఈలోగా వైద్య నివేదికలు, విచారణాధికారుల తదుపరి చర్యలపై అందరి దృష్టి నెలకొంది.

రాజశేఖర్ కూతురిని అని తెలిసినా అలా చేయాలని చాలా ఒత్తిడి చేశారు.. శివాత్మిక సంచలన వ్యాఖ్యలు.

Next Story