అమిస్తాపూర్‌లో ఘోర ప్రమాదం.. స్నేహితుడి బర్త్‌డే వేడుకలకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

by Jakkula.Mamatha |

స్నేహితుని బర్త్డే రోజే.. ఇద్దరు మిత్రులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన మంగళవారం తెల్లవారుజామున మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపల్ కేంద్రం జాతీయ రహదారిపై జరిగింది.

అమిస్తాపూర్‌లో ఘోర ప్రమాదం.. స్నేహితుడి బర్త్‌డే వేడుకలకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
X

దిశ, భూత్పూర్: స్నేహితుని బర్త్డే రోజే.. ఇద్దరు మిత్రులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన మంగళవారం తెల్లవారుజామున మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపల్ కేంద్రం జాతీయ రహదారిపై జరిగింది. హైదరాబాద్‌కు చెందిన అఖిల్ అనే యువకుడు, భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలోని ఇమ్రాన్(23), రాజ (21) స్నేహితులు. సోమవారం అఖిల్ బర్త్డే ఉండడంతో హైదరాబాద్ నుండి అమిస్తాపూర్ గ్రామానికి వచ్చాడు. సోమవారం రాత్రి బర్త్డే వేడుకలు చేసుకుని.. మంగళవారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో ముని రంగస్వామి దేవాలయం వెనకాల జాతీయ రహదారి పక్కన ఉన్న టీ కొట్టు వద్ద టీ తాగి.. తిరిగి భూత్పూర్ వైపు వస్తుండగా పార్కింగ్ లేని చోట డీసీఎం ఆగి ఉండడంతో ఆ డీసీఎంను మోటార్ సైకిల్ పై వచ్చిన ముగ్గురు యువకులు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఇమ్రాన్, రాజు అక్కడికి అక్కడే మరణించగా.. అఖిల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఈ మేరకు భూత్పూర్ ఎస్సై నాగన్న ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story