- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుపతిలో విషాదం.. హాస్టల్ గదిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
తిరుపతిలో విషాదం: MBU బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని భువన ఆత్మహత్య. ప్రైవేట్ హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణం. కేసు నమోదు చేసిన పోలీసులు.

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లాలో విషాదం నెలకొంది. మోహన్ బాబు యూనివర్సిటీలో (MBU) బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న భువన అనే విద్యార్థిని బలవన్మరణానికి (Student commits suicide) పాల్పడింది. తిరుమల పట్టణంలోని సాయితేజ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్న ఆమె, మంగళవారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థినులు గమనించి యాజమాన్యానికి సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. చదువుల ఒత్తిడి, వ్యక్తిగత కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు హాస్టల్ సిబ్బందిని, మృతురాలి స్నేహితులను ఆరా తీస్తున్నారు. చివరి ఏడాదిలో ఉండి, భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న విద్యార్థిని ఇలా తనువు చాలించడం ఆమె కుటుంబ సభ్యులను, తోటి విద్యార్థులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. పూర్తి వివరాలు పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది.






