- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబై లోకల్ ట్రైన్‌లో దారుణం..ప్రయాణికుడిపై హిజ్రాల దాడి
ముంబై లోకల్ ట్రైన్‌లో భయానక దృశ్యం.. డబ్బులు ఇవ్వనందుకు ప్రయాణికుడిపై హిజ్రాల ఘోర దాడి, అసభ్య ప్రవర్తన.. వీడియో వైరల్!

దిశ, వెబ్‌డెస్క్: ముంబై లోకల్ ట్రైన్‌లు ప్రయాణికులకు ఏమాత్రం సురక్షితం కావనే ఆందోళనలు మరోసారి వ్యక్తమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా హిజ్రాలు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ఈ క్రమంలో నడుస్తున్న లోకల్ రైలులో డబ్బుల కోసం ఇద్దరు హిజ్రాలు ఒక యువకుడి పై విచక్షణారహితంగా దాడి చేసిన దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ భయంకరమైన ఘర్షణకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో రైల్వే ప్రయాణికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ అసభ్య ప్రవర్తన
పోలీసులు, స్థానిక కథనాల ప్రకారం.. రాత్రి సమయంలో లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఒక యువకుడిని డబ్బులు ఇవ్వాల్సిందిగా ఇద్దరు హిజ్రాలు డిమాండ్ చేశారు. దానికి ఆ ప్రయాణికుడు నిరాకరించడంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ గొడవ కాస్త పెద్దదై హిజ్రాలు ఇద్దరు కలిసి సదరు యువకుడిపై తీవ్రంగా దాడికి దిగారు. తోటి ప్రయాణికులు చూస్తుండగానే అతనిపై చేతులతో దాడి చేస్తూ, బట్టలు లాగుతూ తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా రైలులోనే ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ దారుణ దృశ్యాలను ఎవరో మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రైల్వే అధికారుల దృష్టికి వెళ్ళింది. రైళ్లలో ఇలాంటి బలవంతపు వసూళ్లు, దాడులు నిత్యకృత్యంగా మారాయని, ఇలాంటి అసాంఘిక శక్తులపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), రైల్వే పోలీసులు (GRP) కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు, ముంబై ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో డిమాండ్ చేస్తున్నారు.






