- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జార్ఖండ్‌లో విషాదం: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్ఎస్‌బీ జవాన్ ఆత్మహత్య
జార్ఖండ్‌లో ఎస్ఎస్‌బీ జవాన్ ఆత్మహత్య. సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ప్రాణాలు విడిచిన ప్రహ్లాద్ కుమార్. కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు.

దిశ, వెబ్ డెస్క్: ఎస్ఎస్‌బీ జవాన్ సర్వీస్ రివాల్వర్ (Service revolver)తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకొవడం కలకలంగా మారింది. ఈ షాకింగ్ ఘటన జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో చోటు చేసుకుంది. సిమారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని 'శిలా పికెట్' వద్ద మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రహ్లాద్ కుమార్ సింగ్ (31) అనే జవాన్ తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. మృతుడు డియోఘర్ జిల్లాలోని మహతోది గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే తోటి జవానులు షాక్‌కు గురయ్యారు.
ప్రస్తుతం జవాన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం చత్రా సదర్ ఆసుపత్రికి తరలించారు. మెజిస్ట్రేట్ పర్యవేక్షణలో వైద్యుల బృందం పోస్ట్‌మార్టం నిర్వహించనుందని శిలా అవుట్‌పోస్ట్ ఇన్‌చార్జ్ హరిశ్చంద్ర తిర్వార్ తెలిపారు. జవాన్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతైన విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.






