బోరిగాం గ్రామంలో విషాదం.. సర్పంచ్ సూసైడ్

by Jakkula.Mamatha |

నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బోరిగాం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

బోరిగాం గ్రామంలో విషాదం.. సర్పంచ్ సూసైడ్
X

దిశ,బైంసా: నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బోరిగాం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సోమవారం గ్రామ సర్పంచ్ పల్లై జ్యోతి తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలంలోనే ఉండి కుటుంబ సభ్యులను, స్థానికులను విచారిస్తున్నారు. పూర్తి వివరాలు మరియు ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ముగిసిన తర్వాతే వెల్లడి కావాల్సి ఉంది. సర్పంచ్ మృతితో బొరిగాం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతురాలు సర్పంచికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Next Story