అయోధ్య నిధుల గోల్‌మాల్‌పై సీబీఐ విచారణ జరపాలి:వి.హనుమంతరావు

by Jakkula.Mamatha |

కేంద్రంలో ధృతరాష్ట్ర పాలన సాగుతోందని బీసీ వెల్ఫేర్ ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు విమర్శించారు.

అయోధ్య నిధుల గోల్‌మాల్‌పై సీబీఐ విచారణ జరపాలి:వి.హనుమంతరావు
X

దిశ, భద్రాచలం: కేంద్రంలో ధృతరాష్ట్ర పాలన సాగుతోందని బీసీ వెల్ఫేర్ ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు విమర్శించారు. రాముడు నడయాడిన భద్రాద్రి రామాలయం వద్ద అయోధ్య రామాలయం నిధులు గోల్ మాల్ పై సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ మౌన దీక్ష చేశారు. అయోధ్య రామాలయం నిర్మాణానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు స్వచ్చందంగా విరాళాలు సమర్పించారని, అది ప్రజల డబ్బు అని అన్నారు. ప్రజలు సమర్పించిన బంగారం కరిగించి అయోధ్య ట్రస్ట్ అమ్ముకుందని ఘాటు విమర్శ చేశారు. తిరుపతిలో లడ్డు, నెయ్యి కుంభకోణం జరిగితేనే సీబీఐ విచారణకు ఆదేశించారని, అయోధ్యలో వందలాది కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే ఎందుకు సీబీఐ విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. అయోధ్య ట్రస్ట్ బోర్డులో ఉన్నవారు అందరూ బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ కు చెందినవారెనని.. వారిని కాపాడేందుకు యోగి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. ఈనెల 19న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్నట్లు, దీక్షలో రాహుల్ గాంధీ పాల్గొంటారని ప్రకటించారు. అంతకు ముందు భద్రాచలం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Next Story