- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలవరం పూర్తిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
పోలవరం ప్రాజెక్టు పూర్తిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమ జిల్లాలో పర్యటించిన ఆయన ధవళేశ్వరం బ్యారేజీ కొత్త గేట్ల నిర్మాణ పనులను ప్రారంభించారు...

దిశ, వెబ్ డెస్క్: పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) పూర్తిపై సీఎం చంద్రబాబు(Cm Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమ జిల్లా(Konaseema District)లో పర్యటించిన ఆయన ధవళేశ్వరం బ్యారేజీ(Davaleswaram Barriage) కొత్త గేట్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు(Godavari Pushkaralu) రాబోతున్నాయని, అప్పటికి ముందే పోలవరం పూర్తి చేసి ప్రజలకు అంకితమిస్తామని చెప్పారు. రూ.153 కోట్లతో కాటన్ బ్యారేజీ గేట్ల మరమ్మత్తు పనులు చేశామని తెలిపారు. కాటన్ బ్యారేజీ నిర్మి్ంచి 175 ఏళ్లు అయిందని గుర్తు చేశారు. దేశానికి అన్నపూర్ణగా గోదావరి డెల్టా మారడానికి కాటనే కారణమన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేదని చెప్పారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇచ్చామన్నారు. కృష్ణా నీటిని రాయలసీమకు అందించామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
నా హయాంలోనే రెండు పుష్కరాలు
‘‘రైతులకు అన్నదాత సుఖీభవ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన సీఎం చంద్రబాబు.. రూ.24 వేల కోట్లు సాగునీటి కోసం ఖర్చు చేశామని తెలిపారు. ‘‘తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే మళ్లీ ఏర్పాటు చేశాం. రెండు పుష్కరాలు నా హయాంలోనే జరుగుతున్నాయి. సైబరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశా.’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.






