- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ది ప్యారడైజ్' టీమ్‌కు నో రెస్ట్.. కారణం అదేనా?
'ది ప్యారడైజ్' షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసేందుకు రెండు యూనిట్లలో చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ క్రేజీ నటుడు నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'ది ప్యారడైజ్' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఆగస్టు 21న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించినప్పటికీ, ఆ తేదీన విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 25 కూడా దగ్గరపడుతున్న నేపథ్యంలో షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయడంపై మేకర్స్ దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఏకకాలంలో రెండు యూనిట్లు పనిచేస్తున్నాయని తెలుస్తోంది.
ఒక యూనిట్ రాత్రి వేళల్లో చిత్రీకరణ జరుపుతుండగా, మరో యూనిట్‌లో కూడా షూటింగ్ కొనసాగుతోంది. నాని ఈ రెండు యూనిట్ల మధ్య సమయాన్ని పంచుకుంటూ ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడ పాల్గొంటూ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. అయితే నిర్ణయించిన గడువులోపు షూటింగ్‌ను పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేయగలరా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినీమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






