మొన్న కాగితాల్లో కడతేర్చారు

by Ratna Kumari |

మంథని తహసీల్దార్ ఆఫీస్ అంటేనే.. డబ్బులు ముట్టజెప్పితే ఏ పనినైనా అవుతుందనే నానుడి ముందు నుండి ఉంది. దానికి ఇటీవల జరిగిన కొన్ని ఉదాహరణలే కారణం.

మొన్న కాగితాల్లో కడతేర్చారు
X

దిశ, మంథని : మంథని తహసీల్దార్ ఆఫీస్ అంటేనే.. డబ్బులు ముట్టజెప్పితే ఏ పనినైనా అవుతుందనే నానుడి ముందు నుండి ఉంది. దానికి ఇటీవల జరిగిన కొన్ని ఉదాహరణలే కారణం. అయితే మొన్న బతికి ఉన్న వ్యక్తిని చనిపోయినట్లు కాగితాల్లో కాడతెర్చి మరొకరి పై అక్రమంగా పట్టా చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే రైతుల భూమిని ఆన్లైన్ లో నుండి తొలగించారు.ఇది మంథని తహసీల్దార్ కార్యాలయం అధికారుల తీరు. రోజు రోజుకు మంథని తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయం వచ్చే వారిలో నమ్మకం సన్నగిల్లే విదంగా తయారైంది.తమకు తెలియకుండా... ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూమిని తొలగించారని బాధిత రైతులు మంథని తహసీల్దార్ ముందు ఆవేదనతో తమ గోడును వెళ్ళబోసుకున్నారు బాధిత రైతులు.మాకు నోటీసులు ఇవ్వకుండా మా భూమిని ఎలా తొలగించరాని ఆన్లైన్ లో ఎవరు తొలగించమని చెప్పారని బాధిత రైతులు మంథని తహసీల్దార్ ను నిలదీశారు.ఎందుకు తొలగించరో తమకు సమాధానం చెప్పాలన్నారు.

రాజకీయ పలుకుబడి ఉన్నాళ్ళోకు... డబ్బులు ఇచ్చినోళ్ళకే పట్టాలు చేస్తున్నారంటు... తహసీల్దార్ ముందు బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.మాకు న్యాయం చేసే వరకు తహసీల్దార్ ఆఫీస్ ముందు నుండి కదిలేదే లేదంటూ.. తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు.మంథని మండలం పోతారం గ్రామానికి చెందిన తుండ్ల చంద్రయ్య, చిన్నయ్య, పద్మ లకు ఉప్పట్ల శివారులో సర్వే నెంబర్ 186 లో భూమి ఉంది. అయితే తమకు ఎలాంటి నోటిసులు ఇవ్వకుండా 8 గుంటలన్నర భూమిని తొలగించారు.మొత్తం 17 గుంటల భూమిని తొలగిచేందుకు ప్రాపోజల్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.తహసీల్దార్ పొంతన లేని సమాధానం చెప్పుతున్నారని ఎంసి కొరకు 3 సం. ల నుండి తిరుగుతూన్నామని వాపోయారు.186 సర్వే నెంబర్ లోని భూమి 185 సర్వే నెంబర్ లోకి బాధలాయించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తహసీల్దార్ కార్యాలయముకు మంథని పోలీస్ లు చేరుకొని సర్ది చెప్పారు.వారం రోజుల్లో సర్వే చేసి సమస్య ను పరిష్కారిస్తామని తహసీల్దార్ రైతులకు చెప్పడంతో నిరసన విరమించారు.దింతో మంథని తహసీల్దార్ ఆఫీస్ పై చర్చనియంశంగా మారింది.రైతు సంఘాల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story