రోడ్డు ప్రమాదం కేసు.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు లొంగుబాటు

by Vemula.Srinu Prasad |

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాద కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ కాశీబుగ్గ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ..

రోడ్డు ప్రమాదం కేసు.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు  లొంగుబాటు
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ(Srikakulam district Kashibugga)లో జరిగిన రోడ్డు ప్రమాద కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు(Former Minsiter Sridiri Appalaraju) కుమారుడు ఆరవ్ వర్మ కాశీబుగ్గ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆరవ్ వర్మ ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

కాశీబుగ్గలో రోడ్డు ప్రమాదం..

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా బైక్ ను నడిపి ఆరవ్ వర్మ.. రోడ్డుపై గొర్రెల కాపరిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. బైక్‌ను నడిపింది మరో వ్యక్తి అంటూ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. కానీ మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ మాత్రమే బైక్ ను నడిపినట్లు సీసీ ఫుటేజ్‌లో ఆధారాలు లభ్యం కావడంతో ఆయన కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. అయితే ఆరవ్ వర్మను తప్పించేందుకు ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Next Story