- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్మీ వాహనాలైనా టోల్ కట్టాల్సిందే
రాజీవ్ రహదారి రేణిగుంట టోల్ ప్లాజా వద్ద ఆర్మీ వాహనాలకు సైతం టోల్ కట్టాల్సిందే అని సిబ్బంది భీష్మించుకొని కూర్చోవడంతో ఆర్మీ కంటైనర్లు టోల్ ప్లాజా లో నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు రాజీవ్ రహదారి రేణిగుంట టోల్ ప్లాజా వద్ద నిలిచిపోయాయి.

దిశ, గన్నేరువరం : రాజీవ్ రహదారి రేణిగుంట టోల్ ప్లాజా వద్ద ఆర్మీ వాహనాలకు సైతం టోల్ కట్టాల్సిందే అని సిబ్బంది భీష్మించుకొని కూర్చోవడంతో ఆర్మీ కంటైనర్లు టోల్ ప్లాజా లో నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు రాజీవ్ రహదారి రేణిగుంట టోల్ ప్లాజా వద్ద నిలిచిపోయాయి. ఆర్మీ వాహనాల రవాణాకు దేశంలో ఏ రహదారి పైన టోల్ కట్టాల్సిన అవసరం లేదని నిబంధనను లెక్కచేయకుండా టోల్ కట్టాల్సిందే అని డిమాండ్ చేయడంతో ఆర్మీ అధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆర్మీ వాహనాలకు టోల్ కట్టేది లేదని టోల్గేట్ లో నే నిలిపివేసి సిబ్బంది భీష్మించుకుని ఉండడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. హైదరాబాదుకు వెళ్లాల్సిన ప్రయాణికులు టోల్ ప్లాజా సిబ్బంది నిర్వాకంతో గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కున్నారు. ట్రాఫిక్ జామ్ విషయం తెలుసుకున్న ఎల్ఎండి పోలీసులు చివరకు టోల్ ప్లాజా సిబ్బందితో మాట్లాడి ఆర్మీ వాహనాలను పంపించడంతో నెమ్మదిగా ట్రాఫిక్ కదిలింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న ప్రయాణికులు టోల్ ప్లాజా సిబ్బంది నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా ధనార్జ నే ధ్యేయంగా టోల్ ప్లాజా సిబ్బంది ప్రవర్తిస్తున్నారని, అధికారులు ఈ విధమైన సంఘటనలు ఎదురు కాకుండా టోల్ ప్లాజా సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ బాధితులు డిమాండ్ చేశారు.






