- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రీడలు సోదర భావాన్ని పెంచుతాయి: కలెక్టర్
by Kodari Anjali |
క్రీడలు ఐక్యతతో పాటు సోదర భావాన్ని పెంచుతాయని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అన్నారు.

X
దిశ, హైదరాబాద్ బ్యూరో: క్రీడలు ఐక్యతతో పాటు సోదర భావాన్ని పెంచుతాయని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అన్నారు. ఈ మేరకు సోమవారం క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వం విద్యతోపాటు క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని క్రీడాకారులు దేశ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా వివిధ క్రీడల కోచ్ లు క్రీడల్లో ప్రత్యేక మెలకువలు నేర్పించాలని సూచించారు. రాష్ట్ర, జాతీయస్థాయిలో కబడ్డీలో రాణించిన 40 మంది క్రీడాకారులకు కబడ్డీ కిట్లతో పాటు ఫిట్ నెస్ పరికరాలను అందచేసి క్రీడల్లో గొప్పగా రాణించి జిల్లాను ముందంజలో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి నందకిషోర్ గోకుల్, కోచ్ నిరిక్షన్ రెడ్డి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






