- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చలాన్ల నుంచి తప్పించుకోవడానికి నెంబర్ ప్లేట్ ట్యాంపెరింగ్
చలాన్ల నుంచి తప్పించుకోవడానికి నకిలీ నంబర్ ప్లేట్ మార్చి తిరుగుతున్న ఓ యువకుని వాహనాన్ని గోషామహల్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు.

దిశ, కార్వాన్: చలాన్ల నుంచి తప్పించుకోవడానికి నకిలీ నెంబర్ ప్లేట్ మార్చి తిరుగుతున్న ఓ యువకుని వాహనాన్ని గోషామహల్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బైరీ రాజు కథనం ప్రకారం.. సోమవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో అఫ్జల్‌గంజ్ టి-జంక్షన్ వద్ద గోషామహల్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అయితే మీర్‌చౌక్ (మీర్ ఆలం మండి) ప్రాంతానికి చెందిన తేజ (22) అనే యువకుడు అనుమానాస్పదంగా ఒక హోండా యాక్టివా వాహనపై వెళ్తుండగా, పోలీసులు వాహనాన్ని అడ్డగించారు. వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా, దానిపై ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్‌ను మార్చినట్లు (టాంపరింగ్) గుర్తించారు. అయితే తేజ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి తన వాహనం అసలు నెంబర్ టీఎస్ 12ఈడబ్ల్యూ 9319 కు బదులుగా, టీ ఎస్ 12ఈ డబ్ల్యూ 8318గా మార్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.






