కారు ఢీకొని వ్యక్తి మృతి

by Ratna Kumari |

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఇందిరానగర్ శివారులో సిద్ధిపేట–వరంగల్ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

కారు ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, ఎల్కతుర్తి : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఇందిరానగర్ శివారులో సిద్ధిపేట–వరంగల్ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ కారులో హనుమకొండ వైపు వెళ్తుండగా, అదే మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన పోగుల ప్రసాద్ (53) ఎల్కతుర్తి నుంచి ముల్కనూర్ వైపు వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాద్ తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు.

Next Story