- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు హస్తినకు సీఎం రేవంత్ రెడ్డి.. నామినేటెడ్ పదవులపై AICC పెద్దలతో భేటీ?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రేపు ఢిల్లీ (Delhi) పర్యటనకు బయలుదేరనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టుల పర్మీషన్లు, నిధుల సాధనతో పాటు పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించేందుకు ఈ పర్యటన ఖరారైంది. ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశం చర్చకు రానున్నట్లుగా తెలుస్తోంది. గోదావరి, కృష్ణా బేసిన్లలోని పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్‌లు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అంతరాష్ట్ర జల వివాదాలపై కేంద్ర పెద్దలతో సీఎం ప్రత్యేకంగా భేటీ కానున్నారు.. అదేవిధంగా హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ అంశంపై కూడా సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టరు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పెద్దలను కలిసి మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన కేంద్ర వాటా నిధులు, అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కోరనున్నారు. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ, ఫ్యూచర్ సిటీ మెట్రో లైన్ల ప్రతిపాదనలను కేంద్రం ముందు పెట్టనున్నారు.
నామినేటెడ్ పదవులపై AICC పెద్దలతో భేటీ
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రాజకీయ ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. రాష్ట్రంలో చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న పలు కార్పొరేషన్ల నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం, ఏఐసీసీ (AICC) అగ్రనేతలతో చర్చించే అవకాశం ఉంది. పార్టీ కోసం కష్టపడిన సీనియర్లు, ఇతర ముఖ్య నేతలకు పదవుల కేటాయింపునకు సంబంధించిన తుది జాబితాను అధిష్టానానికి అందజేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.






