- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐకేపీ వీఓఏలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలి
ఐకేపీ వీఓఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నెలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం డిమాండ్ చేశారు.

దిశ, కనగల్ : ఐకేపీ వీఓఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నెలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కనగల్ మండలంలోని స్త్రీశక్తి ఉపాధి హామీ భవనం ఎదుట ఐకేపీ వీఓఏలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఓఏల పై ప్రభుత్వం అధిక పని భారం మోపుతోందని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. జీఓ నెం.58ను సవరించి రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. పలుమార్లు చర్చలు జరిగినా హామీలు అమలు కాకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్లు తెలిపారు. గౌరవ వేతనం పేరుతో కాకుండా వేతనాలను నేరుగా ఉద్యోగుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో యూనియన్ మండల నాయకులు గడ్డం పద్మ, మేరెడ్డి మానస, ఎం.యమున, లింగాల సుజాత, టి.రజిత తదితరులు పాల్గొన్నారు.






