- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్సీఓను సస్పెండ్ చేయాలని కలెక్టర్‌కు వినతి..
లంబాడ హక్కుల పోరాట సమితి నంగారా భేరి.. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

దిశ, పాల్వంచ రూరల్: సోమవారం లంబాడ హక్కుల పోరాట సమితి నంగారా భేరి.. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో గిరిజన గురుకుల విద్యా వ్యవస్థలో ఆర్‌సీఓ భద్రాచలం వారి పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో కిన్నెరసాని గురుకులం నుండి ఇద్దరు విద్యార్థులు తప్పిపోయారని.. తను ఇష్టానుసారంగా సొంత నిర్ణయాలతో పై అధికారుల అనుమతులు లేకుండా తను సొంతంగా అపాయింట్మెంట్లు, ట్రాన్స్ఫర్లు, డిప్యూటేషన్ అక్రమ పద్ధతిలో ఇవ్వడం జరుగుతుందని వినతిలో పేర్కొన్నారు. డబ్బులు దండుకొని అక్రమమైన మార్గంలో ఆర్‌సీఓ చేపడుతున్న నియామకాలపై గత నాలుగు నెలలుగా నంగారా భేరి ఆధ్వర్యంలో పోరాటం చేయడం జరుగుతుందని, పేద విద్యార్థుల రావలసినటువంటి సీట్లను కూడా 10 నుంచి 20 వేలకు అమ్ముకుంటున్నారని వినతిలో పేర్కొన్నారు.
అవినీతిపై విచారణ నిర్వహించి...
అవినీతికి పాల్పడినటువంటి ఆర్సీలో పై తగు చర్య తీసుకోవాలని ఐటిడిఏ పిఓకు ఫిర్యాదు చేయగా.. ఆర్సీఓ అవినీతిపై విచారణ కమిటీని నియమించడం జరిగిందని తెలిపారు. ఐటీడీఏపిఓ ఉత్తర్వులు జారిచేసి నేటికీ పది రోజులు అయినప్పటి కి నేటికీ ఇంక్వైరీ ప్రారంభం చేయలేదని ఆరోపించారు. దీనిపై ఆర్ సి ఓ తో ఐటిడిఏ పిఓ కూడా ములకతై ఆర్ సి ఓ చేస్తున్నటువంటి అవినీతికి పీవో వత్తాసు పలుకుతున్నాడని అనుమానం ఉందని మా సంఘం బలంగా నమ్ముతున్నదని ఆరోపించారు. ఇట్టి విషయమై కలెక్టర్ దృష్టికి దర్బార్లో వివరించామని అన్నారు. తక్షణమే అవినీతిపై విచారణ నిర్వహించి అవినీతికి పాల్పడినటువంటి ఆర్సీఓను సస్పెండ్ చేయాలని నంగారాభేరి లంబాడ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా అధ్యక్షులు భూక్య లాలు నాయక్, టేకులపల్లి మండల అధ్యక్షుడు మూడు హుస్సేన్ నాయక్, జిల్లా నాయకులు వెంకన్న నాయక్ రాములు నాయక్ బద్రు నాయక్, రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.






