- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎదురెదురుగా ఢీకొన్న రెండు బైకులు
ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామ శివారులోని రామగుండం–బసంత్‌నగర్ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

దిశ, వెల్గటూర్ : ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామ శివారులోని రామగుండం–బసంత్‌నగర్ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మారేడుపల్లి గ్రామానికి చెందిన దర్శనాల మల్లయ్య తన భార్యను వ్యవసాయ పనుల కోసం పొలం వద్ద దింపి ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా, ఎదురుగా పొట్టాల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు మరో ద్విచక్ర వాహనంపై వస్తుండగా రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మల్లయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు సమాచారం. మరో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఉపాధ్యాయుడికి కూడా తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.






