- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫహాద్ ఫాజిల్ ఫాంటసీ కామెడీ సినిమా ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
అయితే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

దిశ, సినిమా: తమిళ, మలయాళ భాషలతో పాటు తెలుగులోనూ ‘పుష్ప’ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నటుడు ఫహాద్ ఫాజిల్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పటివరకు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన ఆయన, ఇప్పుడు నేరుగా ఒక తెలుగు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు శశాంక్ యేలేటి తెరకెక్కించారు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో కలిసి ఎస్.ఎస్. కార్తికేయ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి కుమారుడు కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి సమర్పిస్తుండటం విశేషం. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు విడుదల తేదీని ప్రకటించారు చిత్రబృందం. టీజర్ విషయానికొస్తే.. ఇందులో ఫహాద్ ఫాజిల్ ఒక మెజీషియన్ పాత్రలో కనిపించి అలరించారు.
ఒక చిన్నారి ముందు ఆయన వరుసగా రకరకాల మ్యాజిక్ ట్రిక్స్ చేస్తూ ఆ పాపను నవ్వించడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే ఆ ఆటలో భాగంగా ఒక ట్రిక్ చేసి, ఆ చిన్నారిని మాయం చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ తర్వాతే కథలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. మొదట చాలా సాధారణంగా కనిపించిన ఆ చిన్నారి, ఒక్కసారిగా వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఏదో ఆత్మ ఆవహించినట్లు విచిత్రమైన శక్తులను ప్రదర్శిస్తూ ఆ మెజీషియన్‌కే మైండ్ బ్లాక్ అయ్యేలా షాక్ ఇస్తుంది. పరిస్థితి చేతిదాటిపోవడంతో తీవ్రంగా భయపడిన ఫహాద్, అక్కడి నుంచి ప్రాణాలు దక్కించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ వింత శక్తులు ఉన్న చిన్నారి మాత్రం అతడిని వదలకుండా వెంటాడుతూనే ఉంటుంది. ఈ సీన్లు టీజర్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చేశాయి. ఫహాద్ మార్క్ నటన, కామెడీ టైమింగ్ ఈ టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.






