వామ్మో వానరం

by Ratna Kumari |

అటవీ ప్రాంతంలో జీవించాల్సిన వన్యప్రాణులు...వనం విడి జనావాసనికి చేరి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

వామ్మో వానరం
X

దిశ, కోనరావుపేట : అటవీ ప్రాంతంలో జీవించాల్సిన వన్యప్రాణులు...వనం విడి జనావాసనికి చేరి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.ఆహారం కోసం కోతులు చేస్తున్న అలజడికి జనాలు భేంబెళ్తెతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలం ,మామిడిపల్లి గ్రామంలో ప్రధాన రహదారి పైన సోమవారం వందల సంఖ్యలో కోతులు గుంపులు గుంపులుగా చేరి వచ్చిపోయే ప్రయాణికులపై విరుచుకుపడ్డాయి.పోడు భూముల పేరిట అక్రమార్కులు అడవులను చదును చేస్తుంటే వన్యప్రాణులు ఇండ్లలోకి వస్తున్నాయి అని నెటిజన్లు అంటున్నారు.కానీ మండలంలోని మామిడిపల్లి,బావుసాయిపేట,వట్టిమల్ల,మరిమడ్ల గ్రామాలలో మాత్రం ఈ కోతుల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది.

వందల సంఖ్యలో కోతులు గ్రామంలోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాయి. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు బయటకు వెళ్లాలంటేనే జెంకే పరిస్థితి నెలకొంది.ఈ గ్రామాలకు అటవీ ప్రాంతం అనుకోని ఉండటంతో పంట పొలాల్లోకి చొరబడి పండ్లు, కూరగాయలు, ఇతర పంటలను ధ్వంసం చేస్తూ రైతులకు భారీ నష్టం కలిగిస్తున్నాయి.ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం ఇండ్ల పై కప్పులను,రేకులను కొల్లగొట్టడం కూడా నిత్యకృత్యంగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు.ఈసమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి కోతులను పట్టుకుని సమీప అడవుల్లోకి తరలించి ప్రజలకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Next Story