- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ? ఈనెల 18న తిరుపతిలో సంచలన ప్రెస్‌మీట్
జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మరో బిగ్ అప్‌డేట్ రానేవచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ముఖచిత్రం మరబోతోందానే అనే వార్తను సంచలన వ్యార్తలు దావానంలా వ్యాపిస్తున్నాయి. కొన్నేళ్లుగా పాలిటిక్స్‌కు దూరంగా ఉంటూ కేవలం సినిమాలకే పరిమితమైన జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR).. ఏపీ పాలిటిక్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నట్లుగ అటు ఇండస్ట్రీలోనూ.. ఇటు పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న తారక్.. ఇదే సరైన సమయమని భావిస్తూ రాజకీయ రంగప్రవేశానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
తాత స్ఫూర్తితో.. రూ.100 కోట్లతో సేవా యజ్ఞం
అయితే, తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్ (NTR) ఆశయాలు, ఆయన చూపిన ప్రజాసేవ స్ఫూర్తితోనే తారక్ ఈ సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. నేరుగా పొలిటికల్ డయాస్ ఎక్కుండానే ముందుగా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఒక భారీ ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది. ‘ఊరువాడ’ అనే పేరుతో ఏకంగా రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామాల్లో సైతం విసృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు అంతా సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం. ఈ సేవా యజ్ఞం ద్వారా కింది స్థాయి జనాభాకు నేరుగా కనెక్ట్ అవ్వాలనేదే ‘జూనియర్’ అసలు వ్యూహంగా కనిపిస్తోంది.
ఈనెల 18న బిగ్ ప్రెస్‌మీట్..
‘జూనియర్’ పొలిటికల్ సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్ వేసేందుకు ముహూర్తం కూడా ఖరారైనట్లుగా సమాచారం. ఈ నెల 18న ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని ప్రముఖ తాజ్ హోటల్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ఓ భారీ ప్రెస్‌మీట్ నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మీడియా సమావేశంలోనే తన ‘ఊరువాడ’ సేవా కార్యక్రమాల పోస్టర్‌తో పాటు తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలకు తారక్ తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా, ఈ నెల 18న తిరుపతి (Tirupati) వేదికగా జరగబోయే ప్రెస్‌మీట్‌పై అటు నందమూరి అభిమానుల్లోనూ, ఇటు టీడీపీ శ్రేణుల్లోనూ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది.
తారక్ అభిమానుల రెస్పాన్స్ ఇదే..
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశానికి సంబంధించి నందమూరి అభిమాన సంఘాలు తెరదించాయి. తమ అభిమాన నటుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వారు ఖండించారు. ‘ఊరువాడ’ కార్యక్రమానికి, తారక్ పొలిటికల్ ఎంట్రీకి ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. కేవలం పేదలు, సమాజంలో వెనకబడిన వర్గాల సంక్షేమం కోసమే, పూర్తిగా సేవా దృక్పథంతోనే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్లుగా వారు వెల్లడించారు.






